2, మే 2016, సోమవారం

తలనొప్పికి 45 సెకన్లు నొక్కి పడితే ?

తల నొప్పి బాదిస్తొంద ? ఒత్తిడితో సతమత మవుతున్నరా ? ఇలా ప్రపంచంలో చాల మందికి ఇదే సమస్య తో బాద పడుతుంటారు . మెడిసన్ వేసుకున్న లాభం లేదు , కాని కను బొమ్మల మధ్య ఉండే ప్రాంతంలో 45 సెకన్లు నొక్కి పెట్టి చుడండి ఎక్కడ లేని కొత్త శక్తి వచ్చేస్తుంది . 12 మేజర్ మెరిడియన్స్ , మన శరీరంలో ఉంటాయి . అవన్నీ ఇదే ప్రాంతంలో కనెక్ట్ అయి ఉంటాయి . మనం నొక్కి పట్టినప్పుడు ఇవన్ని రిలాక్స్ అవుతాయి . ఇక్కడ మూడో కన్ను కూడా ఉందని అంటారు . ఇది నొక్కడం వల్ల టేక్షన్ తగ్గుతుంది . రక్త సరపరా మెరుగ్గా జరిగి మెదడులోని ఎండ్రో ఫిన్స్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి . అందుకే ఇది ఒత్తిడి తగ్గించే " కీ  " పాయింట్ కేవలం ఒత్తిడే కాదు జ్ఞాపక శక్తి , తల నొప్పి , కంటి నొప్పులు , ఇన్స్ మోయ , సైనస్ సమస్యల నుండి రక్షణ పొంద వచ్చు . ఒకవేళ ఏ సమస్యలు లేకున్నా ఇలా నొక్కడం వల్ల ఆధ్యాత్మికంగా , భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా చేస్తుంది . మరి ఒత్తిడి గా ఉన్నప్పుడు ఇలా నొక్కి పట్టి చూసుకోండి . 
 

కౌగిలింతలో ఎన్ని రకాలు ఉన్నాయి ?

ఋగ్వేదంలో దశయిత రుక్కులని ఉన్నాయి . దశ అంటే పది . అవి ఆలింగనం , చుంబనం , నఖక్షతాలు , సీత్య్రుతాలు , పానిఘతలు , సంవేశనం ,ఉపసృప్తం , దంతక్షతం , ఔపరిష్టికం , పురుషాయితం . వీటిని కూడా చతుషష్టి అంటారు . పాంచాలికి చతుషష్టి లో చుంబనం మొదలైనవి ఉన్నాయి . చుంబనం అంటే ముద్దు పెట్టుకోవడం . అది ఆలింగనం అంటే కౌగిలించుకోవడం . తరువాత జరిగే పని . ఈ ఆలింగనంలో సమగాతాలింగం , అసమత లింగం , అని రెండు విధలున్నాయి . అసమత లింగం అంటే అంతకు ముందు ఎప్పుడు కలుసుకొని నాయిక , నాయుకులు పరస్పరం ప్రేమను తెలియ పర్చుకోవటం కోసం కౌగిలించుకోవటం . దీనిలో స్పరుష్టకము , విద్దకము , ఉద్గారుష్టకము , పీడితము అని నాలుగు రకాలున్నాయి .ఈ శాస్ర్తంలోసంజ్ఞను బట్టే పేర్లను నిర్ణయించారు . అంటే పేరును బట్టే తత్స్౦బందమైన కర్మలను తెలుసుకోవచ్చు . నాయికా ఎదురైనప్పుడు ,ఎదో పని మీద పోతునట్లుగా ఉన్న నాయకుడను శరీరం తగిలితే దానిని స్పష్టకం అంటారు . ఇతరులేవరు లేని ప్రదేశంలో నాయకుడు నుంచుని ఉండగా గాని కూర్చుని ఉండగా గాని ఎదో ఒక వస్తువును తీసుకో బోతున్నట్లుగా సమీపించి నాయిక తన రొమ్ములతో అతన్ని క్రుమ్మటాన్ని వెంటనే నాయకుడు ఆమెను గట్టిగ పట్టుకోవటాన్ని " విద్దకం " అంటారు . పై రెండు ఆలింగానాలు కొద్ది కొద్దిగా మాత్రమె మాటలు కలసిన నాటిక ,నాయకుల మద్య జరిగేవి . 
చీకట్లో గాని జనం ఎక్కువగా కిక్కిరిసి ఉన్న చోట గాని నిర్జన ప్రదేశంలో గాని మెల్ల మెల్లగా పోతు ఒకరి అవయవాలను ఒకరు నాయికా నాయకులు రాచుకోవటాన్ని " ఉద్ఘరుష్టకం " అంటారు . నాయికను ఒక గోడకు గాని స్తంబానికి గాని , గుంజకు గాని ఆనించి నాయకుడు గట్టిగ పట్టుకుంటే దాన్ని " పీడితకం " అంటారు . పై రెండు సూత్రాలలో చెప్పబడ్డ అనేవి పరస్పరం బాగా పరిచయం ఉన్న నాయికా , నాయకులలో మాత్రమె సాధ్యమవుతాయి . పై సూత్రాలలో చెప్పబడ్డ నాలుగు ఆలింగానాలు కేవలం ఒకరి మీద మరోకరికున్న ప్రేమను తెలియ పరచటానికి మాత్రేమే ఉద్దేశింప బడ్డాయి . ఇక రతి సమయంలో జరిగే ఆలింగానాలు వేరే నాలుగు ఉన్నాయి .అవి  " లతా వేష్టితకం " , వ్రుక్షదిరూడకం " , తిల తండులకం " , మరియు క్షిరనీకం . వీటిలో మొదటి రెండింటిలోను నాయికయో ప్రయోక్తిగా ఉంటుంది . మిగిలిన రెండు నాయిక , నాయకులూ కల్సి ప్రయోగించవచ్చు . లతా అంటే " తీగ " ఆవేష్టనం అంటే చుట్టుకోవటం . లతా వేష్టితకం అనే ఆలింగనంలో నాయికా ,నాయకునిని తీగల చుట్టుకొంటుంది . కాబట్టి దీనికా పేరు వచ్చింది . నాయకుని ముద్దు పెట్టుకోవటం కోసం , క్రిందకి వంచి ఉన్న తన ముఖాన్ని పైకెత్తి , సన్నని మంజులమైన ఒక ధ్వనితో నాయిక , నాయకుని ముఖాన్ని సమీపించి సమ్మోహనంగా చూడటాన్ని లతా వేష్టితకం  అంటారు . తన యొక్క కాలితో నాయకుని కాలుని ఆక్రమించి రెండవ కాలి తోడాతో అతని పిరుదుల భాగాన్ని ఆక్రమించుకొని చుట్టుకొంటు , అతని వీపు భాగానికి ఒక భుజాన్ని తగిలించి రెండవ భుజంతో నాయకుని భుజాన్ని తలను వంచి సన్నని మంజులమైన ఒక ధ్వనితో ముద్దిడ బోవటం " వ్రుక్షది రూడకం " అంటారు . పై రెండు సూత్రాలలో చెప్పిన ఆలింగానాలు నాయికలు చేయవలసినవి . ఈ ఆలింగానాల వాళ్ళ అనురాగం జనిస్తుంది . 
నాయికా , నాయకులూ పక్క మీద పడుకొని ఒకరి తొడలు మరొకరు , ఒకరి భుజాలు మరొకరు స్పర్శిస్తూ గట్టిగ పట్టుకొంటు కౌగిలించు కోవటాన్ని  " తిల తండులం " అంటారు . నాయిక , నాయకులూ ఏమి చూసుకోకుండా ఎముకలు విరగటం వంటివి జరుగుతయోమోనని లక్ష్యం కూడా చేయకుండా ఒకరిలో ఒకరు లీనమై పోయోతట్టుగా ,నాయికా తొడపై  ఉన్నప్పుడు గాని , ఎదురుగ కూర్చున్నప్పుడు గాని , పక్క మీద గాని గట్టిగ కౌగిలించుకొని . పాలు ,నీరుల , ఆనందం పొందునట్లుగా చేసుకొనే ఆలింగనాన్ని  ' క్షీర జలకాలింగన౦ " అంటారు . పైన చెపిన ఆలింగానాలు  నాయికా ,నాయకులూ రతి సమయంలో మాత్రేమే చేసుకోవల్సినవి . 

సూ || ఇత్యుప  గూహన యోగ బాభ్రవీయ 

ఈ విధంగా బాభ్రవీయ మతము అనుసరించి వారు చెప్పిన ఆలింగనాలు వివరింప బడ్డాయి . ఇక మీదట సువర్ణ నాభుడనే ఆచార్యుని మతము ననుసరించే వారు చెప్పిన ఆలింగానాలు వివరింప బడతాయి . 
సువర్ణ నాభుడు చెప్పిన ఆలింగనాలు ఒక లింగంతో మాత్రమె చేసేవి అవి  " ఉరూప గూహనం  " , జఘనోప గూహనం " , " స్తనాలింగానం " ,లాలాటికాలింగనం " నాలుగు విధాలు వీటిని ఎకాంగోపగూహన చతుష్టయం  అంటారు . నాయకుడు నాయిక యొక్క ఒక తొడను గాని లేక రెండు తొడలును గాని లేక నాయికయో నాయకుని యొక్క ఒక తొడను గాని ,రెండు తొడలను గాని ఉపిరి బిగపట్టి శక్తి కొద్ది నొక్కితే అది " ఉరుపగుహనం  " అనబడుతుంది . ఇది కండ పుష్టి  గల నాయికా , నాయకులూ మాత్రమె చేసుకోదగినది . నాయికా , నాయకులూ తమ తమ పిరుదులతో ఒకరి నొకరు నొక్కుకుంటూ ఉన్నప్పుడు , నాయికా జారిన కొప్పుతో , వేళ్ళతో , గిల్లించు కోవటం కోసం , పళ్ళతో కోరికించు కోవటం కోసం ప్రణయ తాడనం కోసం నాయకుని పై ఎగ బ్రకటాన్ని " జఘనొప గూహనం  " అంటారు . నాయకుడు కూర్చుని ఉన్నప్పుడు గాని , ఒత్తిగిలి పడుకున్నప్పుడు గాని నాయికా తన వీపును వంచి స్తనాల చేత  ఆ పురుషుని ఛాతికి తగిలించి అతను తన భారాన్ని మోసేట్టు చేయటం " స్తనలింగ మన బడుతుంది > అప్పుడా నాయకుడు స్పర్శ సుఖానంతటిని ముద్దుగా చేసి తన హృదయం పై పెట్టినట్లుగా ఆనంద పడతాడు . నాయికా ,నాయకులూ ఒకరి నొకరు ఎదురుగ పడుకున్నప్పుడు ముఖంలో , ముఖం పెట్టి , కన్నుల పైన కన్నులు ఆనించి రెండు , మూడు సార్లు డీ కొట్టి నట్లు తాకితే అది  " లలాట కాలింగనం " అవుతుంది . ఆలింగానలలాగే సంవాహనం అంటే పిసకటం కూడా స్పర్శ సుఖన్నిచ్చేదే కాబట్టి అది కూడా ఒక విధమైన ఆలింగనం లాంటిదే అని కొందరి అభిప్రాయం . 
ఆలింగ నానికి  సంవాహ నానికి స్పర్శ విషయంలో ఎక్కువ తేడా లేక పోయిన భిన్న మైన ప్రయోజనం కలిగినదై , అసాధారణ మైనదవటం చేత సంవాహనం , ఆలింగానాల కోవలోకి చేరినది కాదని వాత్సయనుని అభిప్రాయం . రక రకాల ఆలింగానాల తెల్సుకో గోరినవారికి వాటి గురించి వివరిస్తుండగా , దానిని విన్న ఇతరులకు కూడా వాటి పట్ల ఆసక్తి కలుగుతుంది . 
ఇలా అడిగిన వాళ్లకు , వివరించిన వాళ్లకు , వివరిస్తుండగా వినిన వాళ్లకు కూడా రతి చేయాలన్న కోరిక కలుగుతుంది . మరి అలాంటప్పుడు స్వయంగా వాటిని ఆచరించే వాళ్ళుకు కోరిక కలగటంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు . 
శాస్త్రంలో వివరించ బడ్డవి శాస్త్రి త మైన ఆలింగ నాలు . ఎవరికీ వారుఉహించుకొని  చేసుకునేవి కొన్ని ఉంటాయి . అవి అశాస్త్రీ తాలు అయినప్పటికీ అనురాగాన్ని పెంపొందించేవే కాబట్టి వాటిని త్రోసి పుచ్చకుండా ఆచరించ వచ్చు . మనుషులు రతలలోను , ఆలింగ నాలలోను ఎక్కువ అవగాహనా లేకుండా ఉన్నప్పుడు అలావారిని  ప్రోత్సహించెంత  వరకే శాస్త్రాలు . గాని రతి చక్రం గిర్రున తిరుగుతున్నప్పుడు ఇది శాస్త్రితమా , ఆశస్త్రితమ దీన్ని ప్రయోగించ వచ్చా ప్రయోగించ కూడద అన్న ఆలోచన గాని ఇది క్రమమ కాదా అన్న శంక ఉండనే ఉండ కూడదు . 
ఇది వాత్సాయనుడు రచించిన కామ సూత్రాలలోని సాంప్రయోగికం అనే రెండవ అధికరణంలో ఆలింగాన విచారం అనే రెండో అధ్యాయం .